ముంబై: పీచ్ ల నిర్వహణ పేరుతో బీసీసీఐ నీటిని వృథా చేయడంపై మహారాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది రాష్ట్రంలో కరవు నెలకొన్న నేపథ్యంలో నీరుదొరక్క ప్రజలు ఒకవైపు అల్లాడుతంటే.. మరోవైపు ఐపీఎల్ ఏర్పాట్లలో భాగంగా స్టేడియాల్లో పిచ్ నిర్వహణ కోసమని బీసీసీఐ నీటిని వృథా చేస్తోందని హైకోర్టులో లోక్ సత్తా మూమెంట్ అనే స్వచ్ఛంద సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. వాస్తవానికి 2015లో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన కరవు పరిస్థితుల కారణంగా మహారాష్ట్రలో 3 వేల మందికిపైగా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పిచ్ నిర్వహణ కోసమని వేల లీటర్ల నీటిని ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ ను విచారణకు స్పీకరించిన హైకోర్టు ఐపీఎల్ నిర్వహణ పేరుతో నీటిని వృథా చేయడాన్ని తప్పుబట్టింది. నీటిని పొదుపుగా వినియోగించాలని..లేదంటే ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని పేర్కొంది. తమ ఆదేశాలను ధిక్కరించి నీటి వృథా చేస్తే కఠిన చర్యలు తప్పవని బీసీసీఐని హైకోర్టు హెచ్చరించింది. ఇదే సందర్భంలో నీటిని తక్కవ మోతాదులో వినియోగించలేమనుకుంటే..ఐపీఎల్ మ్యాచ్ లను మహారాష్ట్ర నుంచి వేరే రాష్ట్రానికి తరలించవచ్చని బీసీసీఐను హైకోర్టు సూచనలు చేసింది.
Mobile AppDownload and get updated news