లోకేష్ మంత్రి వర్గంలో చేరే అంశంపై రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస్ స్పందించారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన నారా లోకేష్ కు మంత్రివర్గంలో చేరే అన్ని అర్హుతలు ఉన్నాయన్నారు. ఆయన కేబినెట్ లో చేరికను తనతో సహా రాష్ట్రంలో ఉన్న మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలందరూ స్వాగితిస్తున్నారని తెలిపారు. లోకేష్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని తాను ఆకాంక్షిస్తున్న వెల్లడించారు. ప్రస్తుతం లోకేష్ ను మంత్రి వర్గంలోలో తీసుకోవాలని టీడీపీ నేతలు ప్రతిపాదిస్తున్న విషయం తెలిసిందే. లోకేష్ ను కేబినెట్ లో తీసుకోవాలని. ఆయన కోసం తమ పదవులకు రాజీనామా చేస్తామని ఎమ్మెల్యే బోడే ప్రసాద్, ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ప్రకటించిన విషయం తెలిసిందే.
Mobile AppDownload and get updated news