జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్లో తులిప్ పుష్పాల అందాలు విచ్చుకున్నాయి. ఆ అందాలను తనివితీరా వీక్షించేందుకు దేశ విదేశాల పర్యాటకులు శ్రీనగర్లోని తులిప్ తోటల వద్ద బారులు తీరారు. ఈ నగరంలోని తులిప్ తోట ఆసియాలోనే అతిపెద్దదిగా రికార్డులకెక్కింది. మొత్తం 15 హెక్టార్లలో విస్తరించిన ఈ తులిప్ ఉద్యానవనంలో 70 రకాల తులిప్ పుష్పాలు కనువిందు చేస్తాయి. ప్రతీ ఏటా ఈ సీజనులో 1.3 మిలియన్ల తులిప్ పుష్పాలు పుష్పిస్తాయి. ఇది కూడా ఒక రికార్డే. ఈ ఏడాది నాలుగు లక్షల తాజా తులిప్ లను ఉద్యానవనంలో కొలువుతీర్చారు. వీటిలో 20 రకాలు ఈ ఉద్యానవనానికి కొత్తవి. తులిప్ ఉద్యానవనాన్ని సందర్శించిన పర్యాటకులు ఆ అందాలకు దాసోహమైపోయారు. తోటలోని వివిధ ప్రాంతాల్లో ఫోటోలకు ఫోజులిచ్చారు.
Mobile AppDownload and get updated news