పంజాబ్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రాల సరిహద్దుల్లో మాదక ద్రవ్యాల స్మగ్లర్ల ముఠా కార్యకలాపాలు రోజురోజుకు పెచ్చుమీరిపోతున్నాయి. ప్రతీ రోజు ఆ రాష్ట్రాల్లో ఎక్కడో ఒక చోట ఎంతో కొంత స్థాయిలో మాదకద్రవ్యాలు వివిధ రూపాల్లో పట్టుపడుతూనే ఉన్నాయి. తాజాగా పంజాబులోని ఫిరోజ్ పూర్ ప్రాంతంలో ఏకంగా 30 కిలోల హెరాయిన్ ను భద్రాతాసిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. దాన్ని సరఫరా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసారు. హెరాయిన్ రవాణా గురించి సమాచారం అందుకున్న పారామిలటరీ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ సిబ్బంది కూంబింగ్ నిర్వహించారు. ఫిరోజ్ పూర్లోని ఒక రైతు ఇంట్లో సోదాచేయగా పెద్ద ఎత్తున హెరాయిన్ దొరికింది. దాన్ని తూకం వేస్తే 30 కిలోలుగా తేలింది. అయితే, కూంబింగ్ సమయంలో సిబ్బందికి పెద్ద ఎత్తున నగదు కూడా దొరికిందనే ప్రచారం జరిగింది. కానీ, దాన్ని బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులు తోసిపుచ్చారు.
Mobile AppDownload and get updated news