Mobile AppDownload and get updated news
అది బెంగలూరులో కాస్ట్‌లీ అపార్ట్ మెంట్. ఆ అపార్ట్‌మెంట్లోకి అకస్మాత్తుగా గూండాలు జొరపడ్డారు. వారి చేతుల్లో మారణాయుధాలు కూడా ఉన్నాయి. చొరపడీ చొరపడడంతోనే అపార్ట్‌మెంట్ అసోసియేషన్ సభ్యుల గదిలోకి వెళ్లి అందులోని వారిని బయటకు తరిమేసినంత పనిచేసారు. ఆ తరువాత దాన్ని ఆక్రమించుకున్నారు. దాదాపు పదిమంది వరకు దృడకాయులు తమ అపార్ట్‌మెంట్లోకి రావడంతో అందులోని వారికి ముచ్చెమటలు పోసాయి. వారిని చూసి అంతా కాళ్లు చేతులు ఆడక మిన్నకుండిపోగా ఎవరో యువకుడు రహస్యంగా దాన్ని తన మొబైల్ ద్వారా చిత్రీకరించాడు. అంతేకాకుండా ఆ దృశ్యాలను బెంగలూరు పోలీసులకు వాట్స్‌యాప్ ద్వారా పంపించి ఫిర్యాదు చేసాడు. ఇది ఆ తరువాత సోషల్ మీడియాకు చేరి సంచలనమైంది. అసలు ఆ అపార్ట్‌మెంట్లోకి ఆ గూండాలు ఎందుకు వచ్చారు.. వారినెవరు పంపారు. ఆ అపార్ట్‌మెంట్‌ను కట్టిన బిల్డర్‌కు అందులోని గృహస్తులకు మధ్య ఒక విషయమై వివాదం నెలకొంది. దాంతో అతగాడు వారిని బెదిరించేందుకో, లేదా మరేదైనా ఘాతుకం కోసమో వారిని అపార్ట్‌మెంట్లోకి పంపాడని అంటున్నారు.