దేశానికి సాగరమాల ప్రాజెక్ట్ ద్వారా కలిగే ప్రయోజనాలు లెక్కలేనన్ని ఉంటాయని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా దేశంలో ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతాయని తెలిపారు. ఎన్.డి.ఎ. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టుల్లో సాగరమాల ఒకటని ఆయన ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో తెలిపారు. సాగరమాల ద్వారా దేశంలో కోటి మందికి ఉపాథి కల్పన జరుగుతుందన్నారు. మాజీ ప్రధాని వాజపేయి ఈ ప్రాజెక్టు కోసం ఎంతగానో తపించారని ఈ సందర్భంగా హోంమంత్రి గుర్తుచేసారు. వాజపేయి కలల ప్రాజెక్టుల్లో ఒకటిగా గుర్తింపుపొందిన సాగరమాలను సాకారం చేయడానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ కంకణం కట్టుకున్నారన్నారు. గత ప్రభుత్వాల మాదిరిగా ప్రజాసంక్షేమ కార్యక్రమాలను పూర్తిచేసే విషయంలో తాము నిర్లక్ష్యం చూపబోమని చెప్పారు. సాధ్యమైనంత వేగంగా ఈ ప్రాజెక్టును పరిపూర్తిచేస్తామని స్పష్టం చేసారు.
Mobile AppDownload and get updated news