విశాఖ: పార్టీ ఫిరాయింపులపై వైసీపీ మహిళా నేత రోజా ఘాటుగా స్పందించారు. విశాఖ పర్యటనలో ఉన్న ఆమె మీడియాతో మాట్లాడారు. టీడీపీలో ఉన్న వారిపై నమ్మకం లేకనే చంద్రబాబు పార్టీ ఫిరాపింపులను ప్రొత్సహిస్తున్నారని ఆరోపించారు. టీడీపీలో దమ్మన్న మగాళ్ల లేకనే చంద్రబాబు ఇలా చేస్తున్నారని విమర్శిచారు. చంద్రబాబు దిగజారుడు రాజకీయాలకు ఇది ఒక నిదర్శనం మాత్రమే నన్నారు. దమ్ముంటే పార్టీ ఫిరాయించిన వారితో చేత రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని ఆమె ఏపీసీఎంకు సవాల్ విసిరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విశాఖ కు ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు విషయంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఓట్ ఫర్ నోట్ వ్యవహారం బయటపడుతుందనే ఉద్దేశంతోనే చంద్రబాబు కేంద్రాన్ని గట్టిగా నిలదీయడం లేదని రోజా విమర్శలు చేశారు.
Mobile AppDownload and get updated news