వడదెబ్బ నివారణకు తీసుకుంటున్న చర్యలపై హైకోర్టుకు ఏపీ సర్కార్ నివేదిక సమర్పించింది.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం తరఫున 7 వేల వరకు చలివేంద్రాలు ఏర్పాటు చేశామని.. అలాగే 3 వేల వరకు షెల్టర్లు, 10 వేల వరకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసినట్లు వివరణ ఇచ్చింది. అలాగే ఆరు లక్షల వరకు ఓఆర్ఎస్ ప్యాకెట్లు సరఫరా చేశామని పేర్కొంది. వడదెబ్బ మృతుల కుటుంబాలకు లక్ష వరకు ఆర్ధిక సాయం అందించనున్నట్లు న్యాయస్థానికి ఏపీ సర్కార్ నివేదించింది. రాష్ట్రంలో మండుతున్న ఎండల కారణంగా జనాలు పిట్టల్లా రాలిపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్పందించిన హైకోర్టు వడదెబ్బ నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో తెలపాలని ఏపీ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. దీనికి స్పందించిన ఏపీ సర్కార్ ఈ మేరకు వివరణ ఇచ్చింది.
Mobile AppDownload and get updated news