ఈ లోకంలో ప్రేమను మించిన ఔషధం ఏముంటుంది చెప్పండి? ఇప్పుడు ఆ ప్రేమ ఔషధ మహత్మ్యం మరోమారు తెలిసింది. బాలీవుడ్ నట దిగ్గజాల్లో ఒకరయిన దిలిప్ కుమార్ ఆరోగ్యం మెరుగుపడేవిషయంలో ఆయన భార్య అలనాటి అందాల తార సైరాభాను చూపిన శ్రద్ధ ఎనలేనిది. వృద్ధాప్యంలో ఎవరికైనా ఏదో ఒక అనారోగ్య సమస్య ఉండటం సర్వసాధారణ విషయమే. నిండు వృద్ధాప్యంలో ఉన్న దిలిప్ కుమార్ ఆరోగ్యం విషమించిందనే వార్త తెలియగానే యావత్ దేశం స్పందించింది. ఆయన కోలుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించింది. అందరూ కోరుకున్నట్లే ఆయన కోలుకున్నారని సైరాభాను తెలిపారు. ఆయన లీలావతి ఆసుపత్రిలో కోలుకుంటున్న సమయంలో తీసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫోటోలో తన శ్రీమతితో కలిసి దిలిప్ కుమార్ చిరునవ్వులు చిందిస్తున్నారు. నిమోనియాతో పాటు పలు రకాల సమస్యలతో ఆయన లీలావతి ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. దిలిప్ ఆరోగ్యం పట్ల సైరా చూపిన శ్రద్ధ, ప్రేమ కారణంగానే ఆయన కోరుకున్నారని బాలీవుడ్ వర్గాలు ప్రశంసల్లో ముంచెత్తుతున్నాయి.
Mobile AppDownload and get updated news