బెంగళూరు: పీఎస్ విషయంలో బెంగళూరు టెక్స్ టైల్ ఉద్యోగులు చేస్తున్న ఆందోళన హింసాత్మకంగా మారింది. మంగళవారం రోజు హోసూర్ రోడ్ ,తుమ్ కూర్ రోడ్డ , జలహల్లి ప్రాంతాల్లో కార్మికులు తమ నిరసన తెలిపారు. ఈ ఆందోళనలో 5 లక్షల మంది ఉద్యోగులు పాల్గొన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా ఇవాల్టి ఆందోళనలో భాగంగా పలు ప్రభుత్వ వాహనాలకు ఆందోళనకారులు నిప్పంటించారు. మైసూర్ - బెంళూరు జాతీయ రహదానిని దిగ్భంధించారు. దీంతో భారీగా వాహన రాకపోకలు నిలిచిపోయాయి. అడ్డొచ్చిన పోలీసులుపై రాళ్లు రువ్వారు. పీఎఫ్ విత్ డ్రాయల్ నిబంధనలు ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షం ఆందోళనను మరింత ఉదృతం చేస్తామని ఆందోళనకారులు వెల్లడించారు.
పీఎఫ్ విషయంలో కార్మికుల ఆందోళనపై కేంద్ర మంత్రి దత్తాత్రేయ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీఎఫ్ నిబంధనల మార్పుపై కార్మికులతో చర్చిస్తామన్నారు. ప్రస్తుతం ఎలాంటి మార్పులు ఉండబోవని..ఆగస్టు 1 నుంచి కొత్త నిబంధనలు తీసుకొస్తామన్నారు. కార్మికులను నష్టపరిచే ఎలాంటి నిర్మణం తీసుకోబోమని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ స్పష్టం చేశారు.
Mobile AppDownload and get updated news