యూపీఎ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రాజీవ్ గాంధీ ఖేల్ అభియాన్ పేరును మార్చుతూ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది. ఇకపై దానిపేరును ఖేలో ఇండియాగా వ్యవహరించాలంటూ కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆదేశాలిచ్చింది. దేశంలో క్రీడలను ప్రోత్సహించే ఉద్దేశంతో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ పేరిట ఈ కార్యక్రమాన్ని 2014లో యూపీఏ ప్రభుత్వం ప్రారంభించింది. కాగా ఈ నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహంతో ఉంది. కేవలం రాజకీయ కారణాలతోనే ఈ స్కీమ్ పేరు మార్చారన్న ఆరోపణలను ప్రభుత్వం ఖండించింది. ఈ మేరకు క్రీడామంత్రి శర్వానంద సోనోవాల్ ఒక ప్రకటన చేసారు. పేరు మార్పు నిర్ణయంలో రాజకీయాలు లేవని స్పష్టం చేసారు.
Mobile AppDownload and get updated news