డీఎండీకె చీఫ్ విజయ్‌కాంత్ మళ్లీ వివాదంలో చిక్కుకున్నారు. ప్రస్తుతం జరగబోతున్న తమిళ ఎన్నికల్లో పీపుల్స్ వెల్ఫేర్ ఫ్రంట్-డీఎండీకే సంయుక్త సీఎం అభ్యర్థిగా విజయ్‌కాంత్ ఉన్న సంగతి తెలిసిందే. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మే 16వ తేదీన జరుగనున్న తరుణంలో తమ ఫ్రంట్ తరఫున ఆయన ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసారు. అందులో భాగంగా బుధవారం సేలంలో పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లారు. ఆయన కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వెళ్లిన విలేకరులు, కెమేరాపర్సన్లు అప్పటికే అక్కడ ఉన్నారు. కారు దిగిన వెంటనే ఆయనకు సమీపంగా మీడియా ప్రతినిధులు చేరుకోగా విజయ్‌కాంత్ కోపంగా చూసారు. ఒక విలేకరిపైకి నాలుకను బయటకు మడిచి కొడతాను అన్నట్లు చేయికూడా పైకి లేపారు. ఆయన చర్యలతో మీడియా అవాక్కయ్యింది. విజయ్‌కాంత్ కు వివాదాల్లో ఇరుక్కోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో స్వయంగా తన పార్టీలోని నేతలపైనే బహిరంగంగా చేతులు చేసుకున్న చరిత్ర ఆయనది. ఒక విలేకరులపైన కూడా అనుచితంగా ప్రవర్తించారు. ఇదిలా ఉండగా బుధవారం నాడు విజయ్‌కాంత్ తీరు అన్ని చానళ్లలో పదేపదే ప్రసారమై ఆయన పార్టీని ఇరకాటంలోకి నెట్టింది.
Mobile AppDownload and get updated news