వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూకు చెందిన ఒక భవనంపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఆశ్రమంలోని వస్తువులన్నింటినీ చెల్లాచెదురు చేసారు. బుధవారం నాడు మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉజ్జయినీలో జరిగే సింహస్థ కుంభ్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున నిర్మోహీ అఖారా సంస్థకు చెందిన సాధువులు, ఇతర సభ్యులు తరలివచ్చారు. వారికి ఆశారాం బాపూకు చెందిన భవనాన్ని బసచేసేందుకు కేటాయించారు. ఆ భవనంలోకి చేరిన వెంటనే అఖారా సాధువులు, సభ్యులు అందులోని ఆశారాం బాపూ చిత్రపటాలను చూడగానే ఆగ్రహానికి లోనయ్యారు. ఆయన చిత్రపటాలు, ఇతర హోర్డింగులను ధ్వంసం చేసారు. సంస్థ సభ్యులను ఖాళీ చేయాలంటూ హెచ్చరించారు. ఆశారాం లాంటి వారి వల్ల దేశానికి అవమానం కలుగుతోందన్నారు. ఒక మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఆశారాం బాపు జైలులో ఉన్న సంగతి తెలిసిందే.
Mobile AppDownload and get updated news