Mobile AppDownload and get updated news
తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుతం తెలంగాణా మంత్రివర్గంలో ఒకరు. ఆయనను ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయిస్తున్నారు కేసీఆర్. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గానికి జరుగుతున్న ఉపఎన్నికల్లో తెరాస తరుపున తుమ్మల బరిలో దిగుతున్నారు. పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి క్యాన్సర్ తో మరణించిన సంగతి తెలిసిందే. దాంతో ఆ స్థానానికి ఉపఎన్నిక పెట్టాల్సి వచ్చింది. అయితే కాంగ్రెస్ ఆ స్థానాన్ని ఏకగ్రీవం చేయాలని భావించింది. ఈ మేరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని పార్టీల అధినేతలతో చర్చిస్తున్నారు. అలాగే కేసీఆర్ అపాయింట్ మెంట్ కూడా అడిగారు. అతనికి అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. ఈలోపే కేసీఆర్ తెరాస అభ్యర్థిని ఖరారు చేశారు. ఈ ఉపఎన్నికకు కేటీఆర్ ఇన్ ఛార్జిగా వ్యవహరిస్తారు. తుమ్మల నాగేశ్వరరావు 2014లో తెలుగు దేశానికి రాజీనామా చేసి తెరాసలో చేరారు. తుమ్మల ఎమ్మెల్యేగా గెలవకపోయినా... మంత్రి పదవిచ్చి, శాసన మండలికి పంపారు.