పనామా ప్రకంపనలు ఇంకా ఆగలేదు. మొదటి జాబితాలో అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ పేర్లు బయటపడి పెద్ద సంచలనాన్నే సృష్టించాయి. అనంతరం సైఫ్-కరీనా, కరిష్మాల పేర్లు బయటికి వచ్చాయి. ఇప్పుడు ఆ సంచలనాలకి కొనసాగింపుగా మరో బాలీవుడ్ జంట పేరు వెలుగులోకి వచ్చింది. వారు అజయ్ దేవగన్ - కాజోల్. వీరికి బ్రిటన్ లోని వర్జిన్ ఐలాండ్ లో ఉన్న ఓ ఎంటర్ టైన్ మెంట్ సంస్థలో భాగస్వామ్యం ఉన్నట్టు పనామా పత్రాల్లో వెల్లడైంది. అందులో దాదాపు 1000 షేర్లు వీరు కొన్నట్టు పనామా పత్రాలు లీక్ చేశాయి. అజయ్ దేవగన్ తన సంస్థ అయిన నిషా యుగ్ ఎంటర్ టైన్ మెంట్ పేరు మీద ఈ షేర్లు కొన్నట్టు పత్రాల్లో ఉంది. అజయ్ ఆ కంపెనీకి 2013లో డైరెక్టర్‌గా ఉండి ఏడాది తరువాత రాజీనామా చేసినట్టు పత్రాలు వెల్లడించాయి. దీనిపై అజయ్ స్పందిస్తూ... తాను ఆర్‌బీఐ మార్గదర్శకాలను బట్టే విదేశాల్లో పెట్టుబడులు పెట్టానని వివరించారు. ట్యాక్స్‌లు కూడా చెల్లించామని, వాటి వివరాలు ఇప్పటికే తెలియజేశామని తెలిపారు.
Mobile AppDownload and get updated news