విలియం మోసెస్ (21) బెంగళూరులోని ఫ్లిప్ కార్ట్ సంస్థలో సేల్స్ బాయ్ గా పనిచేస్తున్నాడు. ఓ రోజు లవ్లీ (పేరు మార్చాం) అనే అమ్మాయిని చూసి ప్రేమించాడు. ఆమె కూడా ప్రేమకు అంగీకారం తెలిపింది. కొన్ని రోజులు ఆనందంగా ఉన్నారు. ఓ రోజు మోసెస్ శారీరకంగా దగ్గరవ్వాలన్న కోరికను బయటపెట్టాడు. అందుకు లవ్లీ ఒప్పుకుంది. ఆ సమయంలో మోసెస్ కు ఓ నిప్పులాంటి నిజం బయటపడింది. లవ్లీ అమ్మాయి కాదు... ట్రాన్స్ జెండర్ అని. అంటే అమ్మాయిగా మారిన అబ్బాయన్నమాట. ఆ రోజు నుంచి లవ్లీని దూరంగా పెట్టసాగాడు మోసెస్. ఎన్ని సార్లు ఇంటికి రమ్మని పిలిచినా వెళ్లేవాడు కాదు. ఫోన్ చేస్తే ఎత్తేవాడు కాదు. ఓరోజు లవ్లీ అతడి ఆఫీసుకి వెళ్లి పెళ్లి చేసుకోమని అడిగింది. దానికి నిరాకరించాడు మోసెస్. దాంతో నలుగురైదుగురు ట్రాన్స్ జెండర్లను తీసుకుని వెళ్లి మోసెస్ ఇంట్లో గలాభా సృష్టించింది. మోసెస్ తల్లిదండ్రులు కూడా బాధపడ్డారు. దీంతో పోలీస్ స్టేషనుకు వెళ్లి కంప్లయింటు ఇస్తానంటూ బయటికి వచ్చాడు మోసెస్. ఫోన్ ఇంట్లోనే వదిలేశాడు. అలా వారం రోజులు కనిపించకుండా పోయాడు. తల్లిదండ్రులు పోలీసులకు కొడుకు కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. ఈ లోపు లవ్లీ మోసెస్ ఫోటోతో కనిపించడం లేదంటూ కరపత్రాలు వేయించి పంచింది. ఆ విషయం తెలిసి మోసెస్ మరింతగా కుంగిపోయాడు. చివరిగా తన స్నేహితునికి ఫోన్ చేసి కష్టాలన్నీ చెప్పుకున్నాడు. తరువాత రైలుకెదురెళ్లి ప్రాణాలు తీసుకున్నాడు. అతని మృతదేహం కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ దగ్గర కనిపించింది. తల్లిదండ్రులు తమ కొడుకేనని గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read this story in kannada:
http://vijaykarnataka.indiatimes.com/district/bengalurucity/Transgender-love-story-man-commits-suicide/articleshow/52113113.cms
Mobile AppDownload and get updated news