ఆంధ్రప్రదేశ్‌లో పదోతరగతి పరీక్షా ఫలితాలను మే 10న విడుదల చేయనున్నట్టు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. మే 9న ఎంసెట్ ఫలితాలు విడుదల చేస్తామని చెప్పారు. సుప్రీం కోర్టులో ఉన్న నీట్ కేసు గురించి ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నందున నీట్ నుంచి మినహాయింపును కోరినట్టు తెలిపారు. రాష్ట్రానికి అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఒకవేళ సుప్రీం తీర్పు తమకు అనుకూలంగా తీర్పు ఇవ్వకపోతే... మే9న ఎంసెట్ పరీక్షకు సంబంధించి కేవలం ఇంజనీరింగ్ ఫలితాలు మాత్రమే విడుదల చేస్తామని తెలిపారు.
Mobile AppDownload and get updated news