సైఫాబాద్ లోని హాకా భవన్ లో "భరోసా" కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ఈ కేంద్రాన్ని టి. హోంశాఖ మంత్రి నాయని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేధింపులకు గురవుతున్న మహిళలు, ఆపదలో ఉన్న చిన్నారులకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహిళల విషయంలో అన్యాయం జరుగుతుందని తెలిస్తే 100 నెంబర్ కు ఫోన్ చేసి "భరోసా" రక్షణ కేంద్రం ద్వారా రక్షణ పొందవచ్చని పేర్కొన్నారు . చిన్నారుల సంబంధించిన సమస్యల కోసం 1098 కు ఫోన్ చేయవచ్చన్నారు. "భరోసా" కేంద్రం ప్రారంభోత్సవానికి డీజీపీ అనురాగ్ శర్మ, నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, పలువురు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కాగా "భరోసా" కేంద్రానికి రాష్ట్ర హోం శాఖ మంత్రి నాయని ఛైర్మన్ గాను..పోలీసు ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారు.
Mobile AppDownload and get updated news