ఆంధ్రప్రదేశ్ లో పదోతరగతి ఫలితాలు విడుదలయ్యాయి. విశాఖపట్నంలో ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేశారు. మొత్తం ఉత్తీర్ణతా శాతం 94.5గా నమోదైంది. జిల్లా ఫలితాలలో అన్నింటికన్నా కడప జిల్లాలో 98.89 శాతం మంది పాసై మొదటిస్థానంలో నిలువగా, చిత్తూరు 90.11 శాతంలో చివరి స్థానంలో ఉంది. బాలురు 94.30 శాతం మంది పాసవ్వగా, బాలికలు 94.77 శాతం పాసయ్యారు.
Mobile AppDownload and get updated news