ఓ తెలుగు న్యూస్ ఛానల్, రెండు సోషల్ మీడియా వెబ్ సైట్లపై తెలుగు కమెడియన్ వేణుమాధవ్ కేసు వేశాడు. తనను మానసికంగా బాధపెట్టాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వేణుమాధవ్ చనిపోయినట్టు ఓ న్యూస్ ఛానల్‌తో పాటూ, రెండు వెబ్ సైట్లు వార్తలు ప్రసారం చేశాయి. దీంతో ఆ వార్తలని ఆయన ఖండిస్తూ... తాను ఆరోగ్యంగానే ఉన్నానని తెలిపారు. కుషాయిగూడ పోలీస్ స్టేషన్ కు వెళ్లి నేరుగా ఫిర్యాదు చేసి వచ్చారు. ఇటీవలే తమిళ కమెడియన్ సెంథిల్ కూడా మరణించినట్టు వార్తలు గుప్పుమన్నాయి. ఆయన తాను బతికేఉన్నానంటూ వీడియో మెసేజ్ ద్వారా అందరికీ చెప్పాడు.
Mobile AppDownload and get updated news