Mobile AppDownload and get updated news
పిల్లలు బడికెళ్లాక అమ్మ తరువాత నేర్చుకునే పదం ఆవు. అమ్మ, ఆవు...తో మొదలయ్యాకే ఎవరి చదువులైనా ఉన్నతానికి వెళ్లేది. ఆ ఆవుని ఓ పాఠంగా మార్చింది రాజస్థాన్ ప్రభుత్వం. రాజస్థాన్ రాష్ట్రంలోని అయిదో తరగతి హిందీ పాఠ్య పుస్తకంలో ఆవు పిల్లలకు లేఖ రాసినట్టు ఓ పాఠాన్ని పెట్టారు. రెండు ఆవుల ఫోటోలను ముద్రించి... అవి మాట్లాడుతున్నట్టు లేఖా పాఠం పెట్టారు. అందులో గోవు పిల్లలతో... నా బిడ్డల్లారా... నేను మీ అందరికీ శక్తినిస్తాను. తెలివి తేటలని అందిస్తాను. ఆయుష్షును పోస్తాను.... అని అన్నట్టు ఉంది. అలాగే ఆవు ఇచ్చే ఆహారాపదార్థాలను కూడా పాఠ్యాంశంలో ప్రస్తావించారు. 'నేను మీకు పాలను, పెరుగును, నెయ్యిని ఇస్తాను. నా వ్యర్థాలతో కూడా ఔషధాలు, ఎరువులు తయారుచేస్తాను. నా కొడుకులైన ఎద్దులు పంట పండిచడంలో మీకు సాయపడతాయి....' అంటూ గోవు లేఖలో ఉంది. దీనిపై మంత్రి ఓటారామ్ దేవాసి మాట్లాడుతూ... పిల్లల్లో గోవు ప్రయోజనాల పట్ల అవగాహన కల్పించడానికి పాఠ్యాంశం ఉపయోగపడుతుందన్నారు.