ఉత్తరాఖండ్ వ్యవహారం బుధవారంతో కొలిక్కి వచ్చినప్పటికీ..దీనిపై సభలో రగడ మాత్రం కొనసాగుతూనే ఉంది. గత కొన్ని రోజుల నుంచి ఈ వ్యహారం పార్లమెంట్ ఉభయ సభలను కుదిపివేస్తున్న విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్ అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించడం.. అందులో కాంగ్రెస్ సీఎం హరీష్ రావత్ నెగ్గడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. దీంతో కథ ఇక సుఖాంతమైందని అనుకున్నారంతా.. అయితే ఇదే అంశం బుధవారం లోక్ సభను దద్దరిల్లేలా చేసింది. బుధవారం సభలో ఈ అంశాన్ని లేవనెత్తిన కాంగ్రెస్ సభా పక్ష నేత మల్లికార్జున ఖర్గే ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అధికారాన్ని బలవంతంగా లాక్కోవడానికి మోడీ సర్కార్ ప్రయత్నించిదనడానికి ఉత్తరాఖండ్ అంశమే నిదర్శనమన్నారు. ఎన్డీయే సర్కార్ కుఠిల యత్నాలు సాగవని ఉత్తరాఖండ్ అంశంతో తేలిపోయిందని.. ప్రతిపక్షంలో ఉన్నా కాంగ్రెస్ బలం ఏమాత్రం తగ్గలేదనన్నారు. ఇకనైనా ప్రజాస్వామ్యాన్ని హత్య చేయడం మానుకోవాలని మోడీ సర్కార్ మల్లికార్జున ఖర్గే హితవు పలికారు.
ఖర్గే మాట్లాడుతుండగా పలువురు బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ సభలో ఆందోళనకు దిగారు.. ఖర్గే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు కూడా లేచి నిలబడి ప్రతినినాదాలు చేశారు. దీంతో సభలో గందగోళ వాతావరణం నెలకొంది. ఇరు వర్గాల సభ్యులు తమ తమ స్థానాల్లో కూర్చోవాలని స్పీకర్ వారించినప్పటికీ సభ్యుల నినాదాలు కొనసాగిస్తుండంతో స్పీకర్ సభను వాయిదా వేయాల్సి వచ్చింది.
Mobile AppDownload and get updated news