ఉక్రెయిన్ దేశానికి చెందిన ప్రపంచపు అతిపెద్ద కార్గో విమానం మన హైదరాబాద్ నగరంలో శుక్రవారం నాడు హల్ చల్ చేసింది. తుర్క్‌మెనిస్థాన్ నుండి ఆస్ట్రేలియాకు 116 టన్నుల బరువైన జనరేటరును తీసుకెళ్తూ మార్గమధ్యంలో సాంకేతికపరమైన అవసరాలకోసం కొద్ది సేపు శంషాబాద్ విమానాశ్రయంలో ఆగింది. ప్రపంచపు అతిపెద్ద కార్గో విమానంగా దీనికి పేరుంది. అంతేకాదు, అత్యంత పొడవైన బరువైన విమానంగా కూడా ఇది రికార్డ్ నెలకొల్పింది. ఆంటోనోవ్ ఎఎన్-225 మ్రియా అని దీనిని పిలుస్తారు. మిగిలిన కార్గోలకు భిన్నంగా దీనికి ఆరు టర్బో ఫ్యాన్ ఇంజిన్లు, అతిపెద్ద రెక్కలు దీని సొంతం. ఇది ఏకంగా 640 టన్నుల వరకు బరువును మోయగలదు.
Mobile AppDownload and get updated news