ఊపిరి సినిమా తర్వాత ఆ చిత్ర దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అఖిల్ హీరోగా మరో మూవీ రీమేక్ సెట్స్‌పైకి వెళ్తుందనే ప్రచారం జరిగింది. హిందీలో రూ. 100 కోట్ల క్లబ్2లో చేరిన 'యే జవానీ హై దివానీ' సినిమాని అఖిల్ హీరోగా రీమేక్ చేయనున్నారని అప్పట్లో వార్తలొచ్చాయి. నాగార్జున, అఖిల్ ఈ రీమేక్ పట్ల ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారనేది ఆ వార్తల సారాంశం. కానీ ఇంతలోనే ఆ ఇద్దరికి షాక్‌నిస్తూ ఈ రీమేక్‌పై తనకి అంతగా ఆసక్తి లేదని చెప్పేశాడు వంశీ పైడిపల్లి. 'ఊపిరి' ఆల్రెడీ ఓ రీమేక్ కనుక ఆ వెంటనే మరో రీమేక్ చేయడం తనకి ఇష్టంలేదని చెప్పాడట వంశీ. కానీ వాస్తవానికి అసలు కారణాలు వేరే వున్నాయనే ప్రచారం ఊపందుకుంది. తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం మరో బిగ్ స్టార్ హీరోతో సినిమా చేయాలనే ప్లాన్‌లో వున్న వంశీ తన వద్ద ఓ స్టోరీని ఆ బిగ్ స్టార్‌కి వినిపించి అతడి వద్ద గట్టి హామీ పొందినట్టుగా తెలుస్తోంది. బహుశా అఖిల్ సినిమాని ఆదిలోనే వదిలేయడానికే అదే అసలు కారణం అయ్యుంటుందని సినీవర్గాలు చెప్పుకుంటున్నాయి. దీనికి వంశీ పైడిపల్లి ఏం చెబుతాడో వేచిచూడాల్సిందే మరి!
Mobile AppDownload and get updated news