ప్రస్తుతం జరుగుతున్న అంతర్జాతీయ చలనచిత్ర ఉత్సవం కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో బాలీవుడ్ అందాల తార ఐశ్వర్యా రాయ్ బచ్చన్ కొత్త సినిమా సందడి చేయనుంది. ఐష్ నటించిన లేటెస్ట్ మూవీ 'సరబ్‌జిత్'ని నిర్వాహకులు మే 15న కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించనున్నారు. పాకిస్థాన్‌లో గూడచర్యం, తీవ్రవాదం నేరాల కింద అరెస్టై జైలుపాలైన సరబ్‌జిత్ సింగ్ అనే ఓ భారతీయ రైతు యధార్థాగాథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. సరబ్‌జిత్ పాత్రలో రణ్‌దీప్ హుడా నటించగా సరబ్‌జిత్ తరపున న్యాయం కోసం పోరాడిన అతడి 23 ఏళ్ల సోదరి దల్బీర్ కౌర్ పాత్రలో ఐష్ కనిపించనుంది. రిచా చద్దా, దర్శన్ కుమార్‌లు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. గత 15 ఏళ్లుగా కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌కి సుపరిచితురాలైన ఐష్... ఈసారి సరబ్‌జిత్ చిత్ర దర్శకుడు ఒమంగ్ కుమార్‌తోపాటు నిర్మాతలు భూషణ్ కుమార్, జాకీ భగ్నానీ, దీప్షిఖా దేశ్‌ముఖ్, సందీప్ సింగ్‌లతో కలిసి రెడ్ కార్పెట్‌పై కనువిందు చేయనుంది. మే 20న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రీమియర్‌కి కేన్స్ ఫిలిం ఫెస్టివల్ సరైన ఫ్లాట్‌ఫామ్ అని దర్శకుడు ఒమంగ్ అభిప్రాయపడ్డారు.
Mobile AppDownload and get updated news