Mobile AppDownload and get updated news
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయమై జనసేన పార్టీ కూడా కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకు రంగంలోకి దిగుతున్నట్లు కనిపిస్తోంది. ఆంధ్రకు ప్రత్యేక హోదా అవసరమా.. దానికన్నా ఎక్కువే చేస్తున్నాం అంటూ మాటలు చెపుతున్న బీజేపీ తీరుకు నిరసనగా తూర్పుగోదావరి జిల్లాలో జనసేన కార్యకర్తలు జలదీక్ష నిర్వహించి నిరసన తెలిపారు. దాదాపు మూడు గంటల పాటు వారు సముద్రంలో వారు దీక్ష చేసారు. కాకినాడ సముద్ర తీరాన గల ఎన్టీఆర్ బీచ్ లో యువకులు పెద్ద సంఖ్యలో చేరి ప్రత్యేక హోదా కోసం నినదించారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాల్సిందేనంటూ డిమాండ్ చేసారు. కేంద్రం చెపుతున్న నిధులు, ప్రత్యేక రాష్ట్రం లాంటి మాటల వల్ల ఉపయోగముండబోదని స్పష్టం చేసారు. ఇప్పటికైనా పార్టీలకు అతీతంగా అంతా ఏకమై హోదా కోసం ఉద్యమించేందుకు చేతులు కలపాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని నినాదాలు చేసారు.