లంబసింగి నుంచి అరకు వెళ్లే ఆఖరి బస్సులో ఏం జరిగిందనే నేపథ్యంతో తెరకెక్కిన చిత్రం 'అడవిలో లాస్ట్ బస్'. శ్రీ మంజునాథ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రాన్ని ఎస్.డి. అరవింద్ డైరెక్ట్ చేశారు. ఆయనే మ్యూజిక్ కూడా కంపోజ్ చేశారు. అవినాష్, నరసింహరాజు, మేఘశ్రీ, ప్రకాశ్, మానస జోషి, రాజేశ్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. చిత్ర విశేషాల గురించి ప్రజెంటర్ పూజశ్రీ మాట్లాడుతూ 'సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రమిది. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా కన్నడలో విడుదలై ఘన విజయాన్ని సాధించింది. లంబసింగి నుంచి అరకు వెళ్లే ఆఖరి బస్సులో ఏం జరిగిందనే నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం. సూపర్ కాన్సెప్ట్‌తో ఉంటుంది. తెలుగు ప్రేక్షకులకు చాలా కొత్తగా అనిపిస్తుంది. తొలిసారి బీబీసీలో ఈ సినిమా పాట ప్రదర్శితమైంది. రెండు పాటలను తెలుగులో రాకేందుమౌళి వెన్నెలకంటి రాశారు. నందు తుర్లపాటి రాసిన సంభాషణలు హైలైట్ అవుతాయి. డబ్బింగ్‌తో పాటు అనువాద కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ నెల 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. తప్పకుండా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది' అని ఆశాభావం వ్యక్తంచేశారు.
Mobile AppDownload and get updated news