Mobile AppDownload and get updated news
ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 17వ తేదీన ఢిల్లీలో ప్రధానితో సమావేశం కానున్నారు. తన మంత్రి వర్గ సహచరులతో ప్రధాని నరేంద్రమోడీతో సమావేశం సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కానున్నారు. ఈ పర్యటన యావత్తు రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రెవెన్యూ లోటు భర్తీ అంశాలపైనే పూర్తిగా కేంద్రీకృతమయ్యే అవకాశాలున్నాయి. సీఎం పర్యటన వివరాలను ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మీడియాకు ఆదివారం వెల్లడించారు. థాయ్ ల్యాండ్ నుండి సీఎం తన వ్యక్తిగత పర్యటనను పూర్తిచేసుకుని ఆదివారం తెల్లవారు జామున విజయవాడ చేరుకున్నారు. అనంతరం ఆయన ఢిల్లీ పర్యటన ఖరారైంది. రాష్ట్రంలో కరవు తీవ్రత కూడా ఎక్కువగానే ఉంది. అసలే విభజనానంతర ఆర్థిక సమస్యలతో సమమతమవుతున్న రాష్ట్రానికి కరవు మరింత భారంగా తయారైంది. ఈ నేపథ్ంలో కేంద్రం సాయం చేసి తీరాల్సిందేనని సీఎం మోడీ వద్ద స్పష్టంగా చెప్పనున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చంద్రబాబు మోడీకి రాష్ట్ర పరిస్థితులను కూలంకషంగా వివరించనున్నారు. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటనలో సీనియర్ మంత్రులతో పాటు ప్రధాన కార్యదర్శి ఠక్కర్ కూడా ఉంటారు