వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ నేత ఆనం వివేకా మరోసారి ఫైర్ అయ్యారు. జగన్ దీక్ష చేస్తుంది రైతుల కోసం కాదని.. తన సొంత ప్రయోజనాల కోసమన్నారు. రైతు కోసమని ప్రచారం చేసుకున్న ఆ దీక్ష తన సొంత ప్రరిశ్రమలను కాపాడుకునేందుకని విమర్శించారు. తన పరిశ్రమలకు సరిపడ నీళ్లు అందలేదని తెలుసుకున్న జగన్ ఈ దీక్షకు పూనుకున్నారని మండిపడ్డారు. జగన్ చేస్తున్న ఈ దీక్ష.. జలదీక్ష కాదని జలగ దీక్ష అని తనదైన శైలిలో టీడీపీ నేత ఆనం వివేకా విమర్శించారు. కన్నీరు పెడుతుంది.. రాష్ట్ర ప్రజలు కాదని.. ఎమ్మెల్యేలు కోల్పోయిన బాధతో జగన్ ఒక్కడే కన్నీరు పెడుతున్నారని ఆరోపించారు. మరో ఆరు నెలల్లో వైసీపీ ఖాళీ అయిపోతుందని ఈ సందర్భంగా ఆనం వివేకా జోస్యం చెప్పారు.
Mobile AppDownload and get updated news