ఖమ్మం: పాలేరులో రికార్డుస్థాయిలో ఓటింగ్ నమోదైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం వరకు కొనసాగింది. మధ్యాహ్నం వరకు మందకొడిగా సాగిన పోలింగ్ సాయంత్రం అయ్యే సరికి పోలింగ్ సరళి అమాంతంగా పెరిగింది. సాయంత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసే సమయానికి 88 శాతం ఓటింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటలకు క్యూలైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కాగా పాలేరు ఉప ఎన్నికలో పోలింగ్ రికార్టు స్థాయిలో నమోదు కావడంతో గెలుపుపై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Mobile AppDownload and get updated news