పశ్చిమ బెంగాల్ లో దీదీకి మరోసారి ఎవరూ ఎదురొడ్డి నిలవలేకపోయారని ఎగ్జిట్ పోల్ తేల్చిచెప్పింది. తాజాగా ప్రకటించిన ఎగ్జిట్ పోల్ ఫలితాలను పరిశీలించినట్లయితే...242 స్థానాలకు గాను తృణమూల్ 167 స్థానాలు కైవసం చేసుకొని మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తేలింది. వామపక్షాలు 75 స్థానాలతో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవతరిస్తుందని సర్వే ఫలితాల్లో వెల్లడైంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ 45 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసి పరువు దక్కించుకోనుంది. అందరికంటే ప్రచారంతో ఉదరగొట్టిన బీజేపీకి మాత్రం ఫలితాలు చేధు అనుభవాన్ని మిగిల్చిందని... మోడీ సారధ్యంలోని ఆ పార్టీ కేవలం 4 స్థానాలకే పరిమితమౌతుందని ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో తేల్చింది. ఇదే నిజమైతే మోడీ సర్కార్ కు ఇది భారీ ఎదురుదెబ్బగానే భావించాలి. ఎన్నికల ముందు తృణమూల్ సర్కార్ ను పడగొట్టి అధికారాన్ని కైవసం చేసుకుంటామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.. అయితే వారి అంచనాలను తలకిందులు చేస్తూ మమత భారీ విక్టరీకి సాధించినట్లు ఎగ్జిట్ పోల్ చెబుతోంది.
Mobile AppDownload and get updated news