తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు వ్యతిరేకంగా చేపట్టిన దీక్షను జగన్ బుధవారం విరమించారు. తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులు అక్రమమని.. ఆ ప్రాజెక్టులతో ఏపీకి తీరని అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తూ జగన్ దీక్షకు దిగిన విషయం తెలిసిందే. మూడు రోజులు ముగియడంతో రైతులు ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ఎండల్ని సైతం లెక్కచేయకుండా.. ప్రజలు దీక్షా స్థలికి చేరుకోని తనకు మద్దతు తెలపడం చూస్తుంటే వారికష్టాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. తెలంగాణలో అక్రమ ప్రాజెక్టులు కడుతున్నా... చంద్రబాబు సర్కార్ ప్రేక్షక పాత్ర పోషించడం దారుణమన్నారు. అక్రమ ప్రాజెక్టులను అడ్డుకట్టేవేసే దిశగా కార్యచరణ రూపొందించుకొని ముందుకు వెళ్తామని వైసీపీ అధినేత పేర్కొన్నారు.
Mobile AppDownload and get updated news