ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ తొలిసారి పాగా వేసింది. అసోంలో జరిగిన ఎన్నికల్లో 86 సీట్లు సాధించి విజయకేతనం ఎగురవేసింది. మొత్తం 126 స్థానాలున్న అసోంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే కనీసం 64 సీట్లు సాధించాల్సి ఉంది. ఈ మ్యాజిక్ ఫిగర్ ను దాటి వెళ్లడమే కాకుండా మూడింట రెండు వంతుల మెజ్జార్జీ సాధించి కమలదళం బంపర్ విక్టరీ సాధించింది. ఇదిలా ఉండగా అధికారపక్షంగా ఉన్న కాంగ్రెస్ ఈ సారి ప్రతిపక్షంలో కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీకి 25 స్థానాలు మాత్రమే దక్కాయి. మరోవైపు ప్రాంతీయ పార్టీ అయిన ఏఐయూడీఎఫ్ కు 13 స్థానాలు దక్కాయి. ఇతరులు మాత్రం ఒక స్థానంతో సరిపెట్టుకున్నారు. కాగా బీజేపీ తరఫున సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగిన శర్వానంద్ సోనోవాల్ కొత్తగా ఏర్పడబోయే బీజేపీ ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.
Mobile AppDownload and get updated news