1) తనని తాను సకలోర్ ఆనంద సబర్బానందగా చెప్పుకోవడం సోనోవాల్‌కి అలవాటు. 'ప్రతీ ఒక్కరి ఆనందమే తన ఆనందం' అని తనని తాను అలా పరిచయం చేసుకోవడం వెనుకున్న అర్థం. అస్సాం రాజకీయాల్లో ఫైర్‌బ్రాండ్‌గా పేరున్న ఈ బ్రహ్మచారి వయస్సు 53 ఏళ్లు. ఒరిస్సాలో పుట్టిన సోనోవాల్... అస్సాంలో అంచెలంచెలుగా కీలక నేతగా ఎదిగాడు.
2) ప్రస్తుతం కేంద్ర కేబినెట్‌లో సభ్యునిగా వున్న సోనోవాల్.. యువజన, క్రీడాశాఖకి సహాయమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
3) విద్యార్థి దశ నుంచే అక్రమ వలసలపై గళమెత్తిన నేతగా సోనోవాల్‌కి గుర్తింపు వుంది.
4) ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్(ఏఏఎస్‌యు)తో సోనోవాల్ తన రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టారు. తర్వాతి కాలంలో ఇదే ఏఏఎస్‌యు కాస్తా అస్సాం గన పరిషత్(ఏజీపీ)గా రూపుదిద్దుకుంది.
5) 2001లో సోనోవాల్ ఏజీపీలో చేరారు. అదే ఏడాది మోరాన్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు.
6) 2004లో ఏజీపీ తరపున దిబ్రుఘర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
7) పదేళ్లపాటు పార్టీలో కొనసాగిన సోనోవాల్ 2011లో పార్టీ పరమైన విభేదాలతో అందులోంచి బయటికి వచ్చేశారు.
8) అదే ఏడాది బీజేపీలో చేరి ఆ రాష్ట్రంలో కీలకనేతగా ఎదిగారు.
9) 2016, జనవరిలో సోనోవాల్‌ని అస్సాం రాష్ర్ట ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ అధినాయకత్వం ప్రకటించింది.
తనని గెలిపించి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఇచ్చినందుకు సోనోవాల్ అస్సాం వాసులకి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
Mobile AppDownload and get updated news