శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నగరంలో రేగిన గాలివాన ప్రజలను భయకంపితులను చేసింది. సాయంత్రం నగర వాసులు తమ విధులను ముగించుకుని గృహాలకు తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్న వేళ తొలుత చినుకులు ప్రారంభమయ్యాయి. చినుకులు పెద్దవయ్యాయి. వాటికి ఆకస్మికంగా గాలిదేవుడు తోడయ్యాడు. దాదాపు గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ఒక్కసారిగా గాలులు మొదలయ్యాయి. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న నగరం ఆ గాలులకు చిగురుటాకులా వణికిపోయింది. గాలి తాకిడికి పెద్ద పెద్ద వృక్షాలు సైతం కూకటివేళ్లతో సహా పెకిలించుకుపోయాయి. పలుచోట్ల చెట్లు రోడ్లకుఅడ్డంగా కూలిపోవడంతో పలు చోట్ల ట్రాపిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల హోర్డింగులు కుప్పకూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో జీహెచ్ఎంసీ, గ్రేటర్ పోలీసులు రంగంలోకి దిగారు. సత్వరమే ఉపశమన చర్యలు ప్రారంభించారు. కొన్ని ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగి కొందరు గాయపడినట్లు వార్తలు వచ్చాయి.
![]()
Mobile AppDownload and get updated news