భారత మహిళా బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ రియో ఒలింపిక్స్ ఆశలు గల్లంతయ్యాయి. ఇటీవల జరిగిన ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ షిప్ పోటీల రెండో రౌండులో జర్మనీ బాక్సర్ అజైజ్ నిమానీ చేతిలో మేరీకోమ్ పరాజయం పాలయ్యారు. ఈ పోటీల్లో సెమీ ఫైనల్స్ లో అడుగుపెట్టిన వారికే రియో ఒలింపిక్స్ లో పాల్గొనే చాన్స్ లభిస్తుంది. రెండో రౌండులోనే మేరీకోమ్ ఓడిపోవడంతో ఆమెకు ఇక రియో ద్వారాలు మూసుకున్నట్లేనని క్రీడావర్గాలు తెలిపాయి. 51 కిలోల విభాగంలో మేరీకోమ్ చాలాకాలంగా దిగ్విజయ యాత్రను కొనసాగిస్తూవస్తున్నారు. ఐదు సార్లు ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ గా నిలిచి దేశానికి ఆమె కీర్తిప్రతిష్టలు తీసుకువచ్చారు.
లండన్ ఒలింపిక్ క్రీడల్లో కాంస్య పతకాన్ని సాధించడంతో ఆమె పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ఆమె స్ఫూర్తితో పలువురు బాలికలు బాక్సింగ్ రంగంలోకి అడుగుకూడా పెట్టారు. అంతగా ఆమె దేశవాసుల మన్ననలు పొందిన సంగతి తెలిసిందే. ఆమె జీవితచరిత్ర ఇటీవలే బాలీవుడ్ చిత్రంగా కూడా రూపొందించింది. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా మేరీకోమ్ గా నటించింది.
Mobile AppDownload and get updated news