పంజాబ్ తో విశాఖపట్టణంలో ఐపిఎల్ 9వ సీజనులో భాగంగా జరిగిన మ్యాచ్ లో పుణే జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పుణే కెప్టెన్ ఎంఎస్ ధోనీ జట్టు గెలుపు బాధ్యతలను భుజాన వేసుకుని అద్భుతమైన విజయాన్ని అందించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ జట్టు 173 పరుగుల లక్ష్యాన్ని పుణే జట్టు ముందుంచింది. చివరలో ఆరు బంతులకు 23 పరుగులు చేయాల్సిన తరుణంలో దోనీ చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్ లో కెప్టెన్ గా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. 32 బంతుల్లో నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు బాదాడు. 64 పరుగులు చేసి అజేయుడిగా నిలిచాడు. చివరి బంతికి ఆరుపరుగులు అవసరమైన వేళ అక్షర్ పటేల్ వేసిన బంతితో సిక్సర్ కొట్టి చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.ఇదిలా ఉండగా ఈ సీజనులో పుణే జట్టు మొత్తం 14 మ్యాచ్ లు ఆడగా వాటిలో ఐదు మ్యాచ్ లను గెలుపొందింది. పంజాబ్ నాలుగు మ్యాచ్ లను గెలిచింది.
![]()
Mobile AppDownload and get updated news