సిరియా వైపే ఒక్కొక్క అగ్రదేశం తమ గురిని పెడుతున్నాయి. ఇప్పటికే రష్యా, ఫ్రాన్స్ గగనతల దాడులు చేస్తుంటే... వాటికి ఇప్పుడ బ్రిటన్ తోడైంది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల అంతానికి నడుం బిగించిన బ్రిటన్... గగన తల దాడులను మొదలుపెట్టింది. నాలుగు ఆర్ఏఎఫ్ టోర్నడో జెట్స్ సిరియా మీదకి పంపింది. ఈ విషయాన్ని బ్రిటన్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారుల ధ్రువీకరించారు. సిరియాపై దాడికి దిగడానికి ముందు బ్రిటన్ పార్లమెంట్లో ఓటింగ్ నిర్వహించారు. ఎక్కువ మంది దాడులు చేయాల్సిందేనని ఓటు వేశారు. దీంతో బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరూన్ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. దేశాన్ని సురక్షితంగా ఉంచడానికి ఇదే మంచి నిర్ణయమని ఆయన అన్నారు.
Mobile AppDownload and get updated news