Mobile AppDownload and get updated news
అమెరికా అధ్యక్ష పదవికి ముందంజలో ఉన్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ కు కూడా పన్నులు ఎగగొట్టిన చరిత్ర ఉంది. ఈ విషయం తాజాగా విడుదలైన అమెరికా రికార్డుల ద్వారా తెలిసింది. అమెరికా ఆర్థిక వ్యవస్థ గురించి తెగ ఆందోళన చెందుతున్నట్లు తన ప్రసంగాల్లో చెప్పే ట్రంప్ 1970ల కాలంలో రెండు సార్లు పన్నులు చెల్లించకుండా తప్పించుకున్నారు. ఒకసారి తనకు 4 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని చెప్పి పన్నుకట్టకుండా తప్పించుకున్నారు. ఆ తరువాత 1981లో ఒక క్యాసినో లైసెన్స్ కోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆ సమయంలో పన్ను రిటర్నులు ఇతర లావాదేవీలపై విచారణ జరిపారు. దాంతో పన్నుల ఎగవేత విషయం తెలిసింది. ఇదిలా ఉండగా ఆయన ఆర్థిక చరిత్ర విశ్వసనీయతను తెలిపే ట్యాక్స్ రిటర్నులను బయటపెట్టాలంటూ హిల్లరీ క్లింటన్ సహా ప్రత్యర్ధులు ఎప్పటినుండో డిమాండ్ చేస్తూ వస్తున్నారు. కానీ, ఆ ఒక్కటి మాత్రం అడక్కు అనేరీతిలో దాన్ని తప్పించి వేరే అన్ని అంశాలపై ఆయన స్పందిస్తున్నారు.