విజయవాడ: క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం చంద్రబాబు జపాన్ పారిశ్రామిక వేత్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులకు గల అవకాశాల గురించి
వివరించారు. అలాగే రాజధాని అమరావతి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం సీఎం చందబ్రాబు మీడియాతో మాట్లాడుతూ జపాన్ తో సంబంధాలు మరింత బలోపేతం చేసుకుకొని అభివృద్ధిలో మరింత ముందుకు వెళ్తామన్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నుంచి జపాన్ దేశ రాజధాని టోక్యోకు విమాన సర్వీసులను త్వరలో ప్రారంభిస్తామన్నారు. ఏపీలో ఉన్న పుష్కలమైన వనరులకు జపాన్ సాయం తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.
Mobile AppDownload and get updated news