విజయవాడ: అమరావతి నుంచే పూర్తి స్థాయి పాలన సాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు డిప్యూటీ సీఎం చినరాజప్ప వెల్లడించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జూన్ 21 నుంచి వెలగపూడిలో ఏర్పాటు చేసిన సచివాలయం నుంచే పాలన సాగించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 26,27,28 తేదీల్లో తిరుపతిలో జరిగే మహానాడు ను జయప్రదం చేసేందుకు ప్రతీ కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరముందన్నారు. కాపులను బీసీల్లో చేర్చే విషయంలో టీడీపీ చిత్తుశుద్ధితో ఉందని.. కమిటీ నివేదిక అందగానే చర్యలు ప్రారంభిస్తామని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప అన్నారు.
Mobile AppDownload and get updated news