నిండామునిగినా కూడా వరుణుడు తమిళనాడుపై దయచూపిస్తున్నట్లు కనిపించడం లేదు . ఇంకా తన ప్రతాపం చూపించేందుకు సిద్ధమౌతున్నాడు. తాజాగా అందిన సమాచారం ప్రకారం మరో మూడు రోజుల పాటు తమిళనాడులో కుండపోత వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేప్యథంలో తమిళ సర్కార్ మరింత అప్రమత్తమైంది. సహాయక చర్యలు ముమ్మరం చేయడంతో పాటు ముందస్తూ విపత్తును ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే కురిసిన వర్షాలకు అన్ని రంగాలు కుప్పకూలిపోయాయి. రైలు,ఆర్టీసీ, విద్యుత్ ఇలా ఏ రంగాన్ని చూసినా విపత్తుకు గురైనవే. 50 లక్షల మందికిపైగా వరద బాధితులయ్యారు . ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి ద్రుష్యా తమిళనాడు విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని తమిళ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు ఏపీలోని చిత్తూరు,నెల్లూరు, కడప జిల్లాల్లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చిరించింది. దీంతో ఏపీ సర్కార్ కూడా అప్రమత్తమైంది. ఇదిలా ఉండగా తెలంగాణ ప్రాంతంలో చిరుజల్లులు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది.
Mobile AppDownload and get updated news