దేశీయ చిత్ర నిర్మాణ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశలో భాగంగా ఇటీవల కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంది. కాన్స్, ఆస్కార్ లాంటి అంతర్జాతీయ చిత్ర అవార్డులకై అధికారికంగా భారత్ తరఫున ఎంట్రీలుగా వెళ్లే చిత్రాలకు ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నిర్ణయం గనుక కార్యరూపం దాలిస్తే ఆస్కార్ వేడుకకు మన దేశం తరఫున అధికారికంగా వెళ్లే చిత్రానికి రూ. కోటిని అందచేస్తారు. కాన్స్, వెనీస్ లాంటి పేరున్న అవార్డుల పరిశీలనకు వెళ్లే చిత్రాలకు రూ. అరకోటి ఇవ్వనున్నారు.
అంతేకాకుండా ఆయా అవార్డు ఫంక్షన్లకు హాజరయ్యే భారతీయ చిత్ర నిర్మాతలు, దర్శకులు, నటీనటులకు విదేశీయానం సులభతరం చేసేందుకు ప్రత్యేక వీసా కేటగిరి ఒకదాన్ని సృష్టించాలని ఇప్పటికే కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ నుండి హోంశాఖ, విదేశాంగ శాఖలకు ప్రతిపాదనలు కూడా వెళ్లాయని హిందూ దినపత్రిక కథనం రాసింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి రాజ్యవర్థన్ రాథోడ్ కూడా ధ్రువీకరించారు.
Mobile AppDownload and get updated news