Mobile AppDownload and get updated news
తాను చనిపోతూ తన అవయవాలను ఇతరులకు దానం చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపిన పదోతరగతి బాలిక తన మార్కుల్లో కూడా అందిరికన్నా టాపర్ గా నిలిచింది. చనిపోయిన తమ కుమార్తె పరీక్ష ఫలితాలను చూసిన ఆమె తల్లితండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. రాజ్ కోట్ ప్రాంతానికి చెందిన రాధిక అనే ఆ బాలిక చిన్ననాటి నుండి చదువుల్లోమేటి. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలు రాసిన తరువాత ఆమెకు గత నెల 23వ తేదీన తీవ్రమైన అనారోగ్యం సంభవించింది. దాంతో తల్లితండ్రులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. అన్ని పరీక్షలు జరిపిన తరువాత రాధికకు బ్రెయిన్ ట్యూమర్ అని వైద్యులు చెప్పారు. చికిత్స చేస్తున్న సమయంలో రాధిక కోమాలోకి వెళ్లిపోయి బ్రెయిన్ డెడ్ అయింది. అది ఆమె తలలోనే పగిలి రక్తస్రావం అయినందున ఇక బతికే అవకాశంలేదని వైద్యులు చెప్పారు. దాంతో ఆమె తల్లితండ్రులు తమ బిడ్డ అవయవాలను ఇతరులకు దానం చేయాలని నిర్ణయించారు. వారి కోరిక మేరకు వైద్యులు ఆమె నేత్రాలు, గుండె, లివర్, కిడ్నీలను సేకరించి ఇతరులకు అమర్చారు. ఇటీవల విడుదలైన పరీక్ష ఫలితాల్లో రాధికకు 83శాతం మార్కులు వచ్చిన సంగతి తెలిసి ఆ తల్లితండ్రుల గుండెలు తరుక్కుపోయాయి. తాను మొదటి శ్రేణిలో పాసయ్యానని తెలుసుకోవడానికి తమ బిడ్డ బతికిలేదని, బతికిలేని బిడ్డ కోసం ఏడవాలా..ఆమె మంచి మార్కులతో పాసయిందని ఆనందించాలా అని ఆ తల్లితండ్రులు అనుకోరాదని నిర్ణయించారు. తమ బిడ్డ అవయవ దానం ద్వారా బతికే ఉందని వారు గుండె రాయిచేసుకుని ఒకరికి ఒకరు ధైర్యం చెప్పుకుంటున్నారు.