క్రూడ్ అయిల్ ధరలు స్థిరంగా కొనసాగడం.. యూఎస్ పరపతి సమీక్ష అనంతరం వడ్డీ రేట్లును పెంచవచ్చని వార్తలు వచ్చిన నేపథ్యంలో షేర్ కొనుగోళ్లు అధికమయ్యాయి. ఇలాంటి సానుకూల వాతావరణంలో అటు విదేశీ సంస్థగత ఇన్వెస్టర్లు..ఇటు దేశీయ ఇన్వెస్టర్లు ఉత్సహంగా ఈక్వీడిలను కొనుగోలు చేసినట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. నిన్న కూడా 3 నెలల గరిష్ట స్థాయిలో స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో పయనించిన విషయం తెలిసిందే.
బీఎస్ఈ లో మొత్తం 2 వేల 747 కంపెనీలు ట్రేడింగ్ లో పాల్గొనగా... 1,408 కంపెనీలు లాభాల బాటలో పయనించాయి. 1,142 కంపెనీలు నష్టాలను చవిచూశాయి. దేశీయ కంపెనీలైన బీహెచ్ఈఎల్, యాక్సిస్ బ్యాంకు, ఐడియా, ఎల్ అండ్ టీ తదితర కంపెనీలు లాభాల బాటలో పయనించగా.. ఇన్ ఫ్రాటెల్, హెచ్ సిఎల్ టెక్,ఐచర్ మోటార్స్ , బోష్ లిమిటెల్ , రిలయన్స్ తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బుధవారం రూ. 97,02,584 కోట్లుగా ఉన్న బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ గురువారం రూ. 98,11,322 కోట్లకు పెరిగింది. అంటే స్టాక్ మార్కెట్లు దాదాపు లక్ష కోట్ల లాభపడినట్లు తేలింది.
Mobile AppDownload and get updated news