Mobile AppDownload and get updated news
సౌతాఫ్రికాతో జరుగుతున్న నాల్గో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్ లో 334 పరుగులకు ఆలౌటైంది. రహానే సెంచరీ (127) తో కదంతొక్కడంతో ఈ మేరకు స్కోర్ సాధ్యపడింది. ఒకనొక దశలో వికెట్లు వెనువెంటనే పడిపోతున్న తరుణంగా కెప్టెన్ కోహ్లీ(44) రహానేకు అండగా నిలిచాడు. కోహ్లీ ఔట్ అయిన తర్వాత రోహిత్ (1) వికెట్ కీపర్ సాహా (1) వెనువెంటనే ఔటవడంతో టీమిండియా కష్టాల్లోపడింది. ఈ సమయంలో వచ్చిన జడేజా (24) కాసేపు మాత్రమే నిలబడ్డాడు. జడేజా ఔటైన తర్వాత వచ్చిన స్పిన్నర్ అశ్విన్ (56) రహానేకు చక్కటి సహకారాన్ని అందించాడు ఫలితంగా స్కోర్ 300 దాటగల్గింది. నాలుగు టెస్టుల సిరీస్ ను కోహ్లీ సేన ఇప్పటికే 2-0 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ను కూడా టీమిండియా తన ఖాతాలో వేసుకోవాలంటే సఫారీలను తక్కవ స్కోర్ వద్దే కట్టడి చేయాల్సి ఉంది. అప్పడే మ్యాచ్ పై కోహ్లీ సేనా పట్టుబిగించగల్లుతుంది.