స్నేహం - ప్రేమ - ఆకర్షణ వీటి మాయలో పడి నేటి యువత ఏలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారన్న ఆసక్తికరమైన కథాంశంతో యువ దర్శకడు గోపినాథ్ "21st సెంచరీ లవ్ " సినిమాను రూపొందించారు. BRSI మూవీస్ బ్యానర్‌పై పొల్కంపల్లి నరేందర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.. గోపినాథ్, విష్ణుప్రియ జంటగా, పృధ్వీ, వేణు, సుమన్ శెట్టి, చిత్రం శీను ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా గోపినాధ్ మాట్లాడుతూ.. సినిమా ఫస్ట్ కాపీ సిధ్దమయింది. పలువురు సినీ ప్రముఖులు మా సినిమాను చూసి అభినందించటం జరిగింది. స్వయానా గుంటూర్ టాకీస్ చిత్ర నిర్మాత రాజ్ కుమార్ తమ ఆర్.కె స్డూడియోస్ ద్వారా మా చిత్రాన్ని త్వరలోనె విడుదల చేయనున్నారు. నేటి యువతరాన్ని మా సినిమా 100% ఆకట్టుకుంటుందన్నారు. ఆర్.కె .స్డూడియోస్ అధినేత రాజ్ కుమార్ మాట్లాడుతూ.. గుంటూర్ టాకీస్ కమర్షియల్ సక్సెస్ తర్వాత మళ్లీ అదే తరహాలో ఓ ఎంటర్‌టైనింగ్ మూవీని ఆడియెన్స్ ముందుకు తీసుకు వస్తున్నాము. 21st సెంచరీ లవ్ సైతం యూత్‌కు బాగా నచ్చే సినిమా అవుతుంది. దర్శకుడు గోపినాథ్ ఆసక్తికరంగా ఈ సినిమాను తీశారన్నారు.
Mobile AppDownload and get updated news