'బెగ్జిట్' ప్రభావంతో స్టాక్ మార్కెట్లన్నీ కుప్పకూలుతున్నాయి. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడానికి సిద్ధమవడం ఖరారయింది. ఈ వార్తలతో గ్లోబల్ మార్కెట్లన్నీ భారీగా పతనమవుతున్నాయి. శుక్రవారం 11:55 సమయంలో సెన్సెక్స్ 1,010 పాయింట్ల భారీ పతనంతో 25,992 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 316 పాయింట్ల పతనంతో 7,953 గా ట్రేడ్ అవుతోంది. రూపాయి విలువ రెండేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. యూఎస్ డాలర్ తో రూపాయి మారకం విలువ రూ. 68 వద్ద కొనసాగుతుంది.
బులియన్ మార్కెట్ విషయానికి వస్తే బంగారం ధరలు దూసుకెళ్తున్నాయి. మార్కెట్ ప్రారంభంకాగానే శుక్రవారం బంగారం ధర రూ. 1700 పెరిగింది. పది గ్రాముల 99.9శాతం స్వచ్ఛత గల బంగారం ధర రూ. 31, 600 వద్ద కొనసాగుతుంది. వెండి కూడా రూ. 1300 పెరిగి ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 42,500 వద్ద కొనసాగుతుంది.
Mobile AppDownload and get updated news