దేశవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ప్రొ కబడ్డీ రేపటి నుంచే ప్రారంభం కానుంది. వారం రోజులపాటు ఎనిమిది జట్లు అసలైన కబడ్డీ మజా పంచనున్నాయి. శనివారం రాత్రి 8 గంటలకు ముంబయిలో ప్రారంభం కానున్న తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ జట్టు పుణేరి పల్టాన్‌ను ఢీకొట్టనుంది. 2014లో ప్రొకబడ్డీ లీగ్ ఆరంభమైన నాటి నుంచే అత్యధిక వ్యూయర్షిప్ సాధించింది. ఐపీఎల్ తర్వాత దేశంలో ఎక్కువ మంది వీక్షించే లీగ్‌గా ప్రొకబడ్డీ గుర్తింపు పొందింది. 2014లో మూడో స్థానంలో నిలిచిన తెలుగు టైటాన్స్ జట్టు ఈసారి టైటిల్ సాధిస్తామనే ధీమాతో ఉంది. తొలి రెండు సంవత్సరాల్లో ఏడాదికి ఒకసారి మాత్రమే ఈ లీగ్‌ను నిర్వహించగా, ఈ ఏడాది నుంచి సంవత్సరానికి రెండుసార్లు నిర్వహిస్తున్నారు.
Mobile AppDownload and get updated news