బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తన లేటెస్ట్ సినిమా సుల్తాన్ కోసం చాలా శ్రద్ధ తీసుకుంటున్నాడు. సినిమాను సాధ్యమైనంత వరకు ఎంత వాస్తవికంగా వీలుపడితే అంతగా అన్నట్లు రూపొందించాలని సల్లూ భాయ్ తపిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన తాజా సమాచారం ప్రకారం, నటుడు రణదీప్ హుడా చిత్రంలో కీలక పాత్రకోసం ఒప్పుకున్నాడు. సల్మాన్ ఖాన్ కు కుస్తీపోటీలు నేర్పించే శిక్షకుడిగా రణదీప్ కనిపించనున్నాడని డిఎన్ఎ.కామ్ చెప్పింది. దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ కుస్తీపోటీల శిక్షకుడి పాత్రకోసం సరిపడే నటుల కోసం బాగా వెతుకుతున్న తరుణంలో రణదీప్ దొరికాడు. మంచి పర్సనాలిటీతో కండలు తీరి, మంచి ఎత్తుతో ఆకట్టుకునేలా ఉండే రణదీప్ అయితే సల్లూకు కోచ్ గా సరిపోతాడని జాఫర్ భావించాడు. రణదీప్ కు ఓకే చేసేశాడు.
Mobile AppDownload and get updated news